Telangana: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్‌గౌడ్

Telangana New PCC Chief Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు పీసీసీ అధ్యక్షుడి పదవిని ఏఐసీసీ కట్టబెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.

అయితే బీసీ నేతల్లో ప్రధాన పోటీదారులుగా మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండడంతో నిర్ణయాధికారాన్ని అగ్రనేత సోనియాగాంధీకి వదిలేశారు. దీంతో ఆమె మహేశ్ కుమార్ గౌడ్‌పై మొగ్గు చూపారు. ఆమె సూచనల మేరకు ఏఐసీసీ.. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్‌గౌడ్ నియమించింది.

Related News

Latest News