•బైకును ఢీ కొట్టిన గుర్తు తెలియని కారు
వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 21,ప్రతిపక్షం: ఓ గుర్తు తెలియని కారు బైకును ఢీ కొట్టిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నేషనల్ హైవేపై రంగాపూర్ బైపాస్ రోడ్డులో జరిగింది..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని కారు అదేవైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో మానవపాడు మండలం బొంకూరు గ్రామానికి చెందిన బీసన్న తలకు బలమైన గాయమైంది. ప్రమాదానికి కారణమైన కారు అక్కడ ఆగకుండా పరారైపోయింది.ప్రమాద స్థలంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎర్రవల్లి మాజీ సర్పంచ్ రవి స్పందించి తన సొంత వాహనంలో బాధితుడిని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి 108 ద్వారా వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.





























