తెలంగాణలో బీజేపీ అధికారమే ప్రజల ఆకాంక్ష: కిషన్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసోం, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పోలీసు అధికారుల బదిలీలు సచివాలయంలో కాకుండా దారుస్సలాంలో నిర్ణయిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. నగరాన్ని ఎంఐఎం పార్టీ ప్రభావం నుంచి విముక్తి చేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు మున్సిపల్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి, ప్రజల ఆశయాలను నెరవేర్చే ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Spread the love

Related News

Latest News