Trending Now

మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని..

బీజే ఎల్‌పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ : దేశ ప్రధానిగా సుస్థిర పాలకుడు, అభివృద్ధి ప్రదాత సనాతన ధర్మ పరిరక్షకుడు ఆదర్శమూర్తి ప్రధాని నరేంద్ర మోడీ హైట్రిక్ సాధించబోతున్నరని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత, ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్ పట్ల, జాఫ్రాపూర్, గాంధీనగర్, లెఫ్ట్ పోచంపాడు, లోకల్ వెల్మల్ తదితర గ్రామాలలో పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం రమేష్ కు మద్దతుగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూర్యుడు తన ప్రతాపాన్ని ఉదయం నుంచే ప్రదర్శిస్తుండగా.. సుమారు ఐదు ఆరు గ్రామాలలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంట పొలాలు, ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలకు వెళ్లి ఓటర్లను ఉపాధి కూలీలను కలిసి బీజేపీకే ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ.. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన మోసాలు, అన్యాయాలు, స్కాంలు మరే ప్రభుత్వంలో జరగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల సుస్థిర పాలనతో భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న ఆదర్శ దేశంగా పేరొందుతుందన్నారు. మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోగా.. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే బొల్లెడన్ని హామీల పేరుతో మరోమారు మోసగించేందుకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు దేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీనని ఈ విషయాన్ని గుర్తించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు వి. సత్యనారాయణ గౌడ్, బీజేపీ పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్ , జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, భూపతిరెడ్డి, ఆకోజి కిషన్, గంగారెడ్డి, హరీశ్వర్ రెడ్డి, మహమ్మద్ జమాల్ ,ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News