Trending Now

ముగిసిన కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతల సమావేశం..

షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ, సీట్ల సర్దుబాటుపై చర్చ..

వైఎస్ షర్మిల కామెంట్స్..

ప్రతిపక్షం, ఏపీ: పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని.. దీనికి కేంద్రం, రాష్ట్రంలో అధికారం లో ఉన్న పార్టీలే కారణమని వైఎస్ షర్మిలా తెలిపారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదు.. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నాడు చెప్పారు.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేదని షర్మిలా స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టి, మంత్రి పదవులు తీసుకున్నారు. హోదా తెస్తాం నాకు అధికారం ఇవ్వండి అని జగన్ అన్నారు. బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఈ ఐదేళ్లల్లో ఒక్క పోరాటం కూడా చేయలేదని మండిపడ్డారు. మనకి అన్ని‌విధాలా అన్యాయం చేసిన బీజేపీకి.. టీడీపీ, వైసీపీ తొత్తులుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆమే పేర్కొన్నారు. మా పోరాటానికి సిపిఎం, సిపిఐ నేతలు మాకు మద్దతు ఇచ్చారు. 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Spread the love

Related News