Trending Now

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం షురూ..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ పూర్తైన పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనమూ అధికారులు ప్రారంభించారు. తొలిసారి మూల్యాంకన కేంద్రాన్ని సంగారెడ్డిలో కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ పూర్తైన పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనమూ అధికారులు ప్రారంభించారు. తొలిసారి మూల్యాంకన కేంద్రాన్ని సంగారెడ్డిలో కూడా ఏర్పాటు చేశారు.

గతంలో ఈ జిల్లాకు సంబంధించిన మూల్యాంకనం హైదరాబాద్‌లోనే జరిగేది. గత మూడేళ్లుగా రామచంద్రాపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించారు. ఈ ఏడాది నుంచి సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో కూడా నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం నాలుగు విడతల్లో మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులను మార్చి 16లోగా మొదటి విడత మూల్యాంకనం పూర్తి చేస్తారు. మార్చి 20 తేదీ నుంచి రెండో విడతలో ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులను, మార్చి 22 నుంచి మూడో విడతలలో కెమిస్ట్రీ, కామర్స్‌ సబ్జెక్టులను, మార్చి 24 నుంచి నాలుగో విడతలో చరిత్ర, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల జవాబు పత్రాలు దిద్దేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

బోర్డు ఆదేశాలకు అనుగుణంగా మూల్యాంకన ప్రక్రియ ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా మూల్యాంకన ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు క్యాంపు పర్సనల్స్‌గా నలుగురు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరితోపాటు క్యాంపు ఆఫీసర్‌ కూడా ఉంటారు. సమాధాన పత్రాలు సంబంధిత కేంద్రానికి వచ్చిన వెంటనే కోడింగ్‌ చేస్తారు. దీనివల్ల సమాధాన పత్రం ఏ విద్యార్థిది, ఏ కాలేజీదనే వివరాలు దిద్దేవారికి తెలియదు. అక్రమాల నిరోధానికి ఈ విధానాన్నితీసుకొచ్చారు. ఇంటర్‌ బోర్డు నుంచి నియామకపత్రాలు అందిన అధ్యాపకులు మాత్రమే మూల్యాంకన విధుల్లో చేరాల్సి ఉంటుంది. మూల్యాంకన ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన వసతులన్నీ ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. సిబ్బంది తమకు కేటాయించిన తేదీల్లో నిర్దేశిత కేంద్రానికి వచ్చి రిపోర్టు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాంమని హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love