మహిళా లెక్చరర్‌కు స్టూడెంట్ వేధింపులు

ప్రతిపక్షం, జూన్ 16: ఆదిలాబాద్‌లో ఓ మహిళా లెక్చరర్‌ను సోషల్ మీడియా ద్వారా వేధించిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఫిజిక్స్ లెక్చరర్ తనను మందలించారని భావించిన విద్యార్థి, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి గత ఏడాది నవంబర్ నుంచి అసభ్యకర సందేశాలు, పోస్టులు చేస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News