Trending Now

‘మరోసారి అలా చేస్తే.. నీ తాటతీస్తా’.. బీజేపీ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కూడా తనవంతు పాత్ర పోషించిన బీసీ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నోరు పారేసుకోవడం తగదని మరోసారి అలా చేస్తే.. తాట తీస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ పోన్నం ప్రభాకర్ గౌడ్ రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేని కాసం వెంకటేశ్వర్లు అవాకులు.. చవాకులు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే జాగ్రత్త అంటూ గుస్సా వ్యక్తం చేశారు. కాసం వెంకటేశ్వర్లు “ఒక పనికిమాలిన వెధవ” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ బీసీ బిడ్డ అంటూ చెప్పుకుని తిరిగే కాసం వెంకటేశ్వర్లు దమ్ము ధైర్యం ఉంటే బీసీల అభ్యున్నతి కోసం పార్లమెంటులో బిల్లు పెట్టించి ప్రత్యేక హోదా బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతి అని తనలాంటి నిరుపేద సామాన్య కుటుంబంలో పుట్టిన రజక కుటుంబానికి చెందిన తనను ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారని గుర్తు చేశారు. తాను ఏనాడు కూడా రాజకీయంగా ఇంత ఎదుగుతానని అనుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం ఇచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. బీసీల రాజకీయ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి అవాకులు.. చవాకులు పేలుతున్న కాసం వెంకటేశ్వర్లు తన నోరు మరోసారి జారితే తగిన గుణపాఠం చెబుతామని అల్టిమేట్ జారీ చేశారు. ఆర్థిక నేరస్తులకు అండగా నిలిచిన ప్రధాని మోడీ దమ్ముంటే 32 మంది ఆర్థిక నేరగాల్లను పట్టుకొచ్చి ప్రజల నుండి దోచుకున్న నల్లధనాన్ని ఇప్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బీజేపీ నాయకులకు సిగ్గు శరం లజ్జ లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని శంకర్ అన్నారు. తమ మంత్రి పొన్నం ప్రభాకర్ మచ్చలేని నాయకుడని స్పష్టం చేశారు. త్వరలోనే ముదిరాజ్ బీసీ బిడ్డకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని మరెందరో బీసీలకు కూడా రాజకీయ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బీజేపీ ఏనాడైనా ఒక రజకునికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తుందా..? అని సవాల్ విసిరారు. బీసీలపై పూర్తి ప్రేమ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మరోసారి మంత్రి పొన్నం గురించి వాగితే తాటతీస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బాలరాజ్ గౌడ్ కౌన్సిలర్ కృష్ణవేణి అందేమోహన్ శ్రీశైలం గౌడ్ రాజేష్ నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News