Trending Now

మోడీని మూడోసారి ప్రధానిని చేద్దాం..

నిర్మల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : పదేళ్లు సుస్థిర పాలనను అందించి అన్ని వర్గాల హృదయాలను గెలుచుకున్న ఆదర్శ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కూడా ప్రధాని కాబోతున్నారని నిర్మల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మరాజు పేర్కొన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ వాడు 40 పరిధిలోని చింతకుంట వాడలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్నినిర్వహించారు. పదేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోలేదని అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం దేశ పరిరక్షణ కోసం పరితపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి కూడా ప్రధానిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్ట్ పత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ కు ఓటు వేసి బీజేపీ ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలోను బీజేపీ వైపే అన్ని వర్గాల వారు మగ్గుచూపుతున్నారని ఇప్పటికే పలు సర్వేల ద్వారా తెలిసిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు కొండాజీ శ్రావణ్ ,కొండాజీ నరేందర్, గురజాల రాజు, వడ్నాల వేణుగోపాల్, వెలుగుల శ్రవణ్, కొజ్జా ప్రమోద్, కొండా జి. హర్షవర్ధన్, బుక్క నర్సయ్య, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News