తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు..
ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 15: చిట్యాల పట్టణంలోని స్విమ్మింగ్ పూల్ లో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన నలుగురు యువకులు కేకేఆర్ సిమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి వచ్చారు. ఈత కొడుతూ నూనె శ్రీకాంత్ (22) అనే యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ లో డై కొట్టడం వల్ల తలకు బలమైన దెబ్బ తగలడంతో మృతి చెందినట్లు పలువురు భావిస్తున్నారు.
అయితే మృతుడి తల్లి నూనె బుగ్గమ్మ స్విమ్మింగ్ పూల్ లో సరైన నిబంధనలను పాటించకపోవడం వల్లనే తన కొడుకు మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ-2 లింగయ్య తెలిపారు.