Trending Now

కరీంనగర్ లో సంచలనం.. హోటల్ ప్రతిమపై పోలీసుల దాడులు

ప్రతిపక్షం, కరీంనగర్ : కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రతిమ హోటల్స్ లో పోలీసులు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు అణువు అణువు సోదాలు చేస్తున్నాయి. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులు ప్రతిమ హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చి తనీఖీలు చేపట్టారు. శనివారం ఉదయం వరకు కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరీంనగర్ పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకే ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రతిమలో రూ.6.65 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు..

అయితే ప్రతిమ హోటల్స్ కు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధాలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలే అయినా రాజకీయ సమీకరణాలే అయినా ఇక్కడి నుండే మంత్రాంగం నెరిపేందుకు వినోద్ కుమార్ ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులకు కీలక సమాచారం అందడంతో దాడులకు పూనుకోవడం సంచలనంగా మారింది.

Spread the love