తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల పాత్ర ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణ ఆవిర్భావం 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారితీసిన పరిస్థితులు కల్పించింది కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమమేనని ఆయన అన్నారు. ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల పాత్ర ఉందని పేర్కొన్నారు.

ప్రతి చరిత్రలో భిన్న పాత్రలు ఉంటాయని వ్యాఖ్యానించిన కేటీఆర్, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా అనేక రాజకీయ పాత్రలు ఉన్నాయని సూచించారు. అయితే తెలంగాణ కథలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్‌దేనని ఆయన విమర్శించారు.

Spread the love

Related News

Latest News