Trending Now

పది ఫలితాల్లో నేరడ విద్యార్థినీలకు 10 జీపీఏ..

ఎనిమిది పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత..

ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 30: పదవ తరగతి పరీక్షా ఫలితాలలో చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన కందగట్ల కీర్తన, పొట్టబత్తిని ఫణిశ్రీ 10 జీపీఏ, కొన్నె హన్సిక 9.8 జీపీఏ సాధించారు. అలాగే చిట్యాల పట్టణంలోని లయోలో హై స్కూల్‌కు చెందిన వి రామ్ చరణ్ 9.8, గ్రీన్ గ్రో స్కూలుకు చెందిన శ్రీనిఖా రెడ్డి 9.7, ఠాగూర్ విద్యాలయం కు చెందిన పెద్ది సరయు 9.7 జీపీఏ సాధించారు.

చిన్నకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మెట్టు హర్షవర్ధన్ 9.7, ఏపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ధనుష్ 9.7 జిపిఏ సాధించారు. మండలంలో నాలుగు ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. నేరడ, ఎలికట్టే, ఏపూరు, చిట్యాల జడ్పీహెచ్ఎస్ లలో, సెయింట్ మేరీ హై స్కూల్, గ్రీన్ గ్రో హై స్కూల్, ఠాగూర్ విద్యాలయం, ఉరుమడ్లలోని ప్రగతి స్కూల్ లలో 100% ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Spread the love

Related News