Trending Now

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం..

ప్రతిపక్షం, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు. తమిళనాడుకు చెందిన రాధా కృష్ణన్ కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన రాధాకృష్ణన్ తర్వాత ఝార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి రాధాకృష్ణన్ ను ఇన్‌ఛార్జి గవర్నర్ గా నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్ కొనసాగనున్నారు.

Spread the love

Latest News