*చండూర్లో ముదిరాజ్ సంఘాల మహా గర్జన.
*70 ఏళ్లుగా నష్టపోయాం – కామారెడ్డి BC డిక్లరేషన్ హామీనిఅమలు చేయాలి .
*నవంబర్లో భర్తీ చేసే 3 MLC స్థానాల్లో ఒకటి ముదిరాజులకు కేటాయించాలి .
*TMPS జిల్లా అధ్యక్షుడు కోర్వి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్.
*వేలాది మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ – చండూర్ సమావేశంలో ముదిరాజ్ సంఘాల తీర్మానం .
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 23: బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను BC-D నుండి BC-A లోకి మార్చాలని, అలాగే వచ్చే నెలలో భర్తీ చేస్తున్న 3 MLC స్థానాల్లో నీలం మధుకు MLC పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చండూర్ పట్టణంలో జిల్లా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా TMPS జిల్లా అధ్యక్షులు కోర్వి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీల్లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ జాతి 70 ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాలలో ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా రాజకీయంగా జనాభాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి BC డిక్లరేషన్ లో ఇచ్చిన ముఖ్యమైన హామీ BC-D నుండి BC-A కి మార్చడాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే నెల నవంబర్ లో భర్తీ చేస్తున్న 3 MLC స్థానాలలో నీలం మధుకు MLC ఇచ్చి ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
BC-A సాధన కొరకు త్వరలోనే వేలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ముదిరాజ్ సంఘం నాయకులు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు పర్సనబోయిన వెంకటేశం ముదిరాజ్, బీసు అరుణ శ్రీశైలం ముదిరాజ్, మాజీ MPTC పులకరం వెంకన్న ముదిరాజ్, మత్స్యశాఖ చైర్మన్ బొమ్మరబోయిన భార్గవ్ ముదిరాజ్, డైరెక్టర్ పర్సనబోయిన సైదులు ముదిరాజ్, వివిధ ముదిరాజ్ సంఘాల నాయకులు దొంతరబోయిన శివ, సింగం కృష్ణ, జిల్లా రవి, పర్సనబోయిన రాంబాబు, జిల్లా శేఖర్, బొమ్మకంటి లింగస్వామి, కోర్వి సురేష్, కట్ట హరిబాబు, మండలి స్వామి, కోర్వి చంటి, జీనూకల రాము, జీనుకల చక్రవర్తి, బీసు శివ, బీసు శ్రీశైలం, బీసు అంజి, జీనుకల శ్రవణ్, జీనుకల ప్రవీణ్, తాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





























