ప్రతిపక్షం ప్రతినిధి బైంసా మండల్ నవంబర్ 29: ఈరోజు బైంసా మండలంలోని దేగాం గ్రామంలో ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల లోని సుమారు 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ఎందరో మంది నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉండి వారికి భరోసా కల్పిస్తుంది అని అన్నారు.సీఎం సహాయనిది చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముధోల్ మాజీ శాసనసభ్యులు జి.విట్టల్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనెల కళ్యాణ్ కుబీర్ గ్రామ సర్పంచ్ సాయినాథ్,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజన్న,మాజీ సర్పంచ్ విజయ్, నిర్మల్ జిల్లా డిసిసి సెక్రెటరీ సూది రాజన్న,మాజీ ఏఎంసి చైర్మన్ సంతోష్, సర్పంచులు దేవేందర్, AMC డైరెక్టర్ అరుణ్,మాజీ సర్పంచులు అబ్దుల్ గని, దత్తు గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నిల సుదర్శన్, మైనార్టీ నాయకులు జావేద్,కుబీర్ edhga సదర్, దత్తు, మాజీ ఉపసర్పంచ్ కండల నరసయ్య, డాక్టర్ రాజేశ్వర్, భూమన్న, దత్త హరి మరియు తదితరులు ఉన్నారు.





























