ముధోల్ గ్రామంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సహాయం
ప్రతిపక్షం ప్రతినిధి ముధోల్, నవంబర్ 28: నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామంలో విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహిస్తూ, ప్రజా ట్రస్ట్ తరఫున చైర్మన్ శ్రీ బోస్లే మోహన్రావు పాటిల్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ముధోల్ గ్రామంలోని ASH Boys School, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ZPHS ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రవీంద్ర ప్రైవేట్ స్కూల్, శిశుమందిర్ పాఠశాల, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల మరియు MJPTBCW రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను, 11వ మరియు 12వ తరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందజేయడం జరిగింది.
విద్యార్థులు అందించిన పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని, శ్రద్ధతో చదివి మంచి ఫలితాలు సాధించి, ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్రావు పాటిల్ ఆకాంక్షించారు.
విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే లక్ష్యంతో ప్రజా ట్రస్ట్ చేపట్టిన ఈ విద్యా సహాయ కార్యక్రమం ఎంతో అభినందనీయం.
విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్రావు పాటిల్ చేస్తున్న కృషికి పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.































