డిసెంబర్ 7న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలి

AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెర్లికంటి శ్రీకాంత్ పిలుపు.

ప్రతి పక్షం చండూరు నవంబర్ 25: కేంద్ర ప్రభుత్వ ప్రజా, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో డిసెంబర్ 7, 2026న న్యూఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెర్లికంటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు.బుధవారం చండూరు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయం మాధగోని నరసింహ భవన్‌లో అఖిల భారత యువజన సమైక్య (AIYF) చండూరు మండల సమితి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెర్లికంటి శ్రీకాంత్ హాజరై మాట్లాడారు.దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం (BNEGA)ను పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం (NEP-2020)ను ఉపసంహరించుకోవాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, అందరికీ సమానమైన, ఉచిత విద్య అందించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడానికి, విద్యా – ఉపాధి హక్కుల సాధన కోసం డిసెంబర్ 7న జరిగే పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, AIYF నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం నవీన్, మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి సాయి, ప్రవీణ్, దోటి వెంకన్న, లింగస్వామి, నరేష్, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Related News

Latest News