తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి కవిత కీలక అడుగు

సిద్ధిపేట జిల్లా కమిటీ ప్రకటన

జిల్లా అధ్యక్షుడిగా లోక రవిచంద్ర నియామకం

సిద్ధిపేట నియోజకవరం ఇంఛార్జిగా చల్లారం మల్లారెడ్డి

దుబ్బాక పట్టణ అధ్యక్షురాలిగా కామాజీ అనూరాధ

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 20: తెలంగాణ రక్షణ సేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత సిద్దిపేట జిల్లా కమిటీని ప్రకటించారు. పార్టీ సంస్థా గత విస్తరణలో భాగంగా జిల్లా, నియోజకవర్గ, పట్టణ స్థాయిల్లో కీలక బాధ్యతలను కేటాయిస్తూ నూతన నియామకాలు చేపట్టారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సిద్ధిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు లోక రవిచంద్ర, సిద్ధిపేట నియోజకవర్గ ఇంచార్జిగా నంగునూరు మండలం తిమ్మాయిపల్లికి చెందిన చల్లారం మల్లారెడ్డి, దుబ్బాక పట్టణ అధ్యక్షురాలిగా కామాజి అనురాధ నియమితులయ్యారు. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం, స్థానిక సమస్యలపై స్పందించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలకు ఈ నియామకాలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.

నూతనంగా చేపట్టిన నాయకులు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లా, నియోజకవర్గ, పట్టణ స్థాయిల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన సిద్ధిపేట జిల్లాలో పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. తమ మీద నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Related News

Latest News