ప్రతిపక్షం, జూలై 07: తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. ఇటీవల ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అనారోగ్య కారణాలతో తొలుత అరెస్ట్ చేయకుండా నోటీసులు జారీ చేసిన ఏసీబీ, తాజాగా ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది.

















