అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 04: అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్కడి ప్రజలకు, ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న తెలంగాణవాసులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అభివృద్ధిలో తెలంగాణకు చెందిన వైద్యులు, ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభతో విశేష సేవలందిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న ప్రతి తెలుగు బిడ్డను అభినందించిన సీఎం, అమెరికాలోని తెలంగాణ సమాజం రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలకు వారధిగా నిలుస్తోందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణవారితో బంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ఎల్లప్పుడూ స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రెండు దేశాల మధ్య స్నేహం, శాంతి, పరస్పర సహకారం మరింత బలపడాలని ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News