అప్పులపై లెక్కల యుద్ధానికి సిద్ధమైన బీఆర్ఎస్.. జూపల్లి సవాల్‌ స్వీకరించిన కేటీఆర్, హరీశ్

ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ అప్పుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఉదయం తెలంగాణ భవన్‌లో అధికారిక లెక్కలతో చర్చకు హాజరవుతామని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించిన వారు, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నివేదికల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలతో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్‌కు తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో అప్పుల అంశంపై మరోసారి వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Spread the love

Related News

Latest News