Trending Now

వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి, మార్చి 22: ప్రభుత్వం సూచించే ఆరోగ్య కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా వైద్యశాఖాధికారి పుట్ల శ్రీనివాస్ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిల్లాలోని వర్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా కొత్తగా నిర్మాణం చేపడుతున్న భవన నిర్మాణ పనుల గురించి కాంట్రాక్టర్నీ అడిగి తెలుసుకున్నారు. మరో మూడు నెలల్లోపనులు పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ తెలిపారు. అనంతరం వర్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య కార్యక్రమాల పనితీరును, రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్ ని , ఎల్ టి ఒక పనితీరును రికార్డులను పరిశీలించడం, సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు.

ఆరోగ్య కార్యక్రమాలను 100% టార్గెట్లను పూర్తి చేసుకోవాలని, వైద్య సిబ్బంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సమయపాలన పాటించాలని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు 100% పూర్తయి విధంగా చూసుకోవాలని సూచించారు. మాతా శిశు సంరక్ష చర్యల గురించి ప్రజల్లో క్షేత్రస్థాయి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్య అధికారులకు, అన్ని ఆరోగ్య కార్యక్రమాల పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస, డాక్టర్ బాబ్జి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కాశీనాథ్ , తదితరులు పాల్గొన్నారు.

Spread the love