Trending Now

Lalithaa Jewelers: ఏపీకి లలితా జ్యువెలర్స్ అధినేత భారీ విరాళం

Lalita Jewelers announced huge donation to flood victims: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 74 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం నిరంతరం కష్టపడుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు కోవిడ్ సమయంలో కూడా ఏపీకి భారీ విరాళం అందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి విరాళం అందించారు. తాజాగా, మరోసారి అండగా నిలిచారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆయనను అభినందించారు. కాగా, వరద బాధితుల కోసం ఇప్పటికే సినిమా పరిశ్రమ నుంచి ప్రముఖ హీరోలు విరాళాలు ప్రకటించారు.

Spread the love

Related News

Latest News