Trending Now

‘సీజనల్ వ్యాధులను అరికడదాం’

మున్సిపల్ వైస్ చైర్మన్ జాకియోద్దీన్

ప్రతిపక్షం, గజ్వేల్, జూలై 2: పరిసరాల పరిశుభ్రత ముందు జాగ్రత్తతో సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని మున్సిపల్ వైస్ చైర్మన్ జాకియోద్దీన్ అన్నారు. మంగళవారం రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి 8వ వార్డులో పాత ఎంపీడీవో ఆఫీస్ నుండి మైనార్టీ వార్డు వరకు డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై,దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎపిడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, నాగరాజు, దుర్గ గౌడ్, ఫీల్డ్ వర్కర్, ఆశ వర్కర్లు జుబేదా బేగం, సుజాత పాల్గొన్నారు.

Spread the love

Related News