ప్రతిపక్షం, స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కానుందని, మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే నిర్వహించబడతాయని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి మార్చి 22న ముహూర్తం ఖరారు చేయాలని తాము చూస్తున్నామని ఆయన చెప్పారు. తొలి 10 రోజుల షెడ్యూల్‌ని ముందుగా ప్రకటిస్తామని.. మిగిలిన మ్యాచ్‌ల జాబితాను సార్వత్రిక ఎన్నికల తేదీలను ఖరారు చేశాక వెల్లడిస్తామని అరుణ్ అన్నారు. ముందుగానే పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తే.. నిర్దిష్ట వేదికలకు భద్రతా వ్యవహారాల్లో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.