ప్రతిపక్షం, సెప్టెంబర్ 04: హైదరాబాద్ ఎర్రగడ్డలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై బోరబండ పోలీసులు దాడి చేశారు. రామ్స్ ఎన్‌క్లేవ్‌లోని ఈవా బ్యూటీ అండ్ స్పాపై పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్పా నిర్వాహకుడు కృష్ణ రిసెప్షన్ వద్ద ఇద్దరు మహిళలతో ఉండగా పోలీసులు గుర్తించారు. మరోవైపు సూర్య ఆనంద్ అనే వ్యక్తి ఓ గదిలో మహిళతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
స్పా నిర్వాహకుడు అజయ్ ఆధ్వర్యంలో మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్పా నిర్వహణ పేరుతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.





























