ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో నేడు వర్షాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతూ అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ జల్లులు పడే అవకాశముందని పేర్కొన్నారు.
ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని తెలిపారు.





























