ప్రతి పక్షం చండూరు ఆగస్టు 29: చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కురుపాటి శ్రీను గారి మాతృమూర్తి కురుపాటి ఎమ్మెల్యే గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
వారి కుటుంబ సభ్యులను ఈ రోజు గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉజ్జిని ఉషా అనిల్ రావు , బీఆర్ఎస్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో కురుపాటి బిక్షమయ్య కుటుంబానికి రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి, వార్డు సభ్యులు తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, గ్రామ నాయకులు పెండ్యాల ఉపేందర్, దామెర అనిల్, కురుపాటి రాజు, కురుపాటి సాయిలు, కురుపాటి కృష్ణ, నక్క కృష్ణయ్య, క్రాంతి, నవీన్, కొమ్మనపల్లి శ్రీను, భూతరాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు.





























