*7వ వార్డులో డ్రైనేజీ, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన .
*7వ వార్డులో అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు
ప్రతి పక్షం చండూరు ఆగస్టు 29: చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని 7వ వార్డులో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు.మునుగోడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీకి కేటాయించిన రూ. 15 కోట్ల అభివృద్ధి నిధుల నుండి ఈరోజు 7వ వార్డులో డ్రైనేజీ మరియు సిసి రోడ్ల నిర్మాణ పనులను చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కోడి సుష్మా వెంకన్న మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చండూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. వార్డులో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తూ, వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూతురాజు దశరథ గారు, కౌన్సిలర్లు వాసు, జెల్లా ధనమ్మ శ్రీనివాసులు, కో-ఆప్షన్ మెంబర్లు ఖలీల్, షరీఫ్, మొగుదాల వెంకన్న, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, పున్న సైదులు, చెనగాని కిరణ్, బొమ్మగాని కిరణ్, జగన్, విజయ తదితరులు పాల్గొన్నారు.





























