‘దూబే బ్రో.. జట్టులో ఎందుకున్నావ్?’.. వరుస వైఫల్యాలతో నెటిజన్ల ఫైర్

ప్రతిపక్షం, జూలై 17: ఆల్‌రౌండర్ శివమ్ దూబే వరుసగా విఫలమవుతుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 42, 5, 2, 22, 14 పరుగులు చేసిన దూబే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఫీల్డింగ్‌లోనూ అతడి ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి.

తాజా వన్డే సిరీస్‌లోనూ దూబే పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఇంతకాలం అవకాశాలు ఇచ్చినా ఫామ్‌లోకి రాలేకపోతున్నాడు.. వెంటనే జట్టు నుంచి తప్పించాలి’ అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News