గ్యారంటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం

ప్రతిపక్షం, జూలై 17: చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి రూ.50 వేల వరకు రుణం అందిస్తారు. ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి రూ.5 లక్షల వరకు, వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణాలకు సాధారణంగా ఎలాంటి పూచీకత్తు లేదా గ్యారంటీ అవసరం ఉండదు. రుణం కోసం వ్యాపార ప్రణాళిక, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, గత కొన్ని నెలల బ్యాంకు ఖాతా వివరాలతో బ్యాంకులను సంప్రదించవచ్చు.

Spread the love

Related News

Latest News