అతితక్కువ వర్షపాతం.. కేంద్రం సమీక్ష

ప్రతిపక్షం, జూలై 04: దేశంలో ఈ ఏడాది జూన్ నెలలో నమోదైన అల్ప వర్షపాతంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 1901 తర్వాత ఐదో అత్యల్ప వర్షపాతం నమోదైన నెలగా జూన్ నిలవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు.

జులై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో, దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై చర్చించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా ఆదేశించారు.

ఈ ఏడాది జూన్‌లో దేశవ్యాప్తంగా కేవలం 99.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై, సాధారణంతో పోలిస్తే 40 శాతం లోటు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News