శాలువా, బొకే తిరస్కరించిన విజయ్.. హీరో విశాల్ ఏం చేశారంటే?

ప్రతిపక్షం, జూన్ 17: తమిళ నటుడు విశాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసే సందర్భంగా శాలువాలు, పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని ఆయన చేసిన విజ్ఞప్తిని గౌరవిస్తూ, వాటికి అయ్యే ఖర్చును ముగ్గురు పేద బాలికల విద్య కోసం విరాళంగా అందించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విశాల్, విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. తమ కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, విజయ్‌ను ప్రేమగా “డార్లింగ్” అని సంబోధించారు. అధికారం వచ్చినా విజయ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని కొనియాడారు.

Spread the love

Related News

Latest News