[t4b-ticker]

543 లోక్‌సభ సీట్లు శాశ్వతం చేయాలి.. మోదీకి విజయ్ లేఖ

ప్రతిపక్షం, ఆగస్టు 14: లోక్‌సభలో ఎంపీ సీట్ల సంఖ్యను శాశ్వతంగా 543గా కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీలో ఎలాంటి మార్పులు చేయకూడదని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు విజయ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(a)ను అమలు చేస్తే జనాభా లెక్కల అనంతరం దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల పంపిణీలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News