•జూన్ 25 నుండి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం:వనపర్తి ఎమ్మెల్యే. మేఘా రెడ్డి
ప్రతిపక్షం, జూన్ 25, వనపర్తి ప్రతినిధి: జూన్ 25 నుండి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం ప్రారంభం కానున్న సందర్భంగా అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాలలో ఉన్న తప్పుల సవరణ, నకిలీ ఓట్ల గుర్తింపు మరియు తొలగింపు ప్రక్రియలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వనపర్తి ఎమ్మెల్యే. తూడీ మేఘా రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాలలో ఉన్న తప్పుల సవరణ, నకిలీ ఓట్ల గుర్తింపు మరియు తొలగింపు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది కాబట్టి ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను గుర్తించడం, ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిచేయించడం,మరణించినవారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అవసరమని అన్నారు.ప్రతి బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా కృషి చేయాలని ఎమ్మెల్యే. మేఘా రెడ్డి కోరారు.

















