ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయమే సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురుతో మాట్లాడారు. రైతు బజార్ వద్ద హోటల్ లో టీ తాగి, ఈ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో ఉన్న మార్కెట్ తోపాటు, అక్కడ ఉన్న ప్రజలు కార్మికులతో ముచ్చటించారు. పలువురి ఇళ్లకు వెళ్లి ఓటుని అభ్యర్థించారు. పట్టణంలో మూడు, నాలుగు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లు కూడా నిర్వహించారు.