Trending Now

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చేపప్రసాదాన్ని ఆస్తమా రోగులకు అందించేందుకు నేడు, రేపు అనగా 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ లో సిద్దం చేశారు. ఈ చేపమందు ఆస్తమా రోగులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. నిన్నటి నుంచే నాంపల్లి గ్రౌండ్ కు బారులు తీరారు.

Spread the love

Related News

Latest News