Trending Now

వారి దగ్గరున్న డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు చేస్తాం : మంత్రి పొన్నం

ప్రతిపక్షం, తెలంగాణ: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల దగ్గరున్న డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని శనివారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వంటి వీఐపీల వద్ద ఉండే డ్రైవర్లకు ఫిట్ నెస్ టెస్టులు చేస్తామని తెలిపారు. సుదూర ప్రాంతాలకు కేవలం సెలెక్టెడ్ డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు.

అనంతరం బస్ కండక్టర్లకు కీలక సూచనలు చేశారు. బస్ కండక్టర్లు అనవసరంగా టికెట్‌లు కొట్టి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2023 అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీలో 453, నాన్ జీహెచ్‌ఎంసీలో 3,030 కొత్త ఆటోలు కొంటే.. 2024 జనవరిలో జీహెచ్ఎంసీలో 233, నాన్ జీహెచ్‌ఎంసీలో 1,836 ఆటోలు కొన్నారని చెప్పారు. ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కి 6 వెలకోట్లు అప్పులు ఉన్నవని.. మహాలక్ష్మి ద్వారా మహిళలు పెద్ద ఎత్తున బస్ లలో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళలు రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు వెళ్తున్నడంతో.. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం మొదలైన తర్వాత రోజు 50 లక్షల మంది బస్ లలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే RTC లాభాల బాట పడుతుందన్నారు.

Spread the love