Trending Now

‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్‌గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.

తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్‌పథ్‌లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.

Spread the love

Related News