ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు. బుధవారం ద్వారంపూడి మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి. ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్‌కు ఇదేం ఖర్మ. తన సామాజికవర్గం ఎక్కువ ఉందనే పిఠాపురం వెళ్లారు. కానీ పిఠాపురం ప్రజలు పవన్‌ను కచ్చితంగా ఓడిస్తారు.’ అని అన్నారు.