ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలి. రైతులకు మేలు జరగాలి’ అని ఆయన ఆకాంక్షించారు.