Trending Now

సీఏఏ హెల్ప్‌లైన్‌ నంబర్ ను ప్రారంభించిన హోం శాఖ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఏఏ కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి సహాయపడటానికి కేంద్ర హోంశాఖ ఓ హెల్ప్‌ లైన్‌ను ప్రారంభించింది. దరఖాస్తుదారుల సందేశాలు తీర్చడం, సమాచారం అందించడానికి ‘1032’ నంబర్‌కు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉదయం 8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు ఫోన్ చేయవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సీఏఏకు సంబంధించి మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి 2014, డిసెంబర్‌ 31కు ముందు భారత్‌కు శరణార్థులుగా వచ్చి ఉంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది.

Spread the love