ప్రతిపక్షం, జూన్ 17: జీ-7 సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ తీరంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.
ప్రాంతీయ ఘర్షణల కారణంగా మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సముద్ర మార్గాల్లో ప్రయాణించే నావికుల భద్రతను నిర్ధారించడం అన్ని దేశాల బాధ్యత అని ప్రధాని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు నిరంతరం సురక్షితంగా ఉండేలా ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

















