ICC Men’s Test Team Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్ రెండో స్థానం, డారిల్ మిచెల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెప్టెంబర్ 2021 తర్వాత తొలిసారి టాప్ 5లోకి చేరుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ ర్యాంకు మెరుగయ్యాయి. జైస్వాల్ ఆరో స్థానం, విరాట్ ఏడో స్థానంలో నిలిచారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హెజిల్ వుడ్, బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. కమిన్స్, రబాడ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రవీంద్ర జడేజా ఏడు, కుల్దీప్ 15 వ స్థానంలో ఉన్నారు.