కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన సోనియమ్మ ను విమర్శించే అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ దేనని పేర్కొన్నారు. సోనియమ్మ గురించి ఇష్టం వచ్చినట్లు బీజేపీ నాయకులు మాట్లాడితే వింటూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు కనీస అవగాహన ఉండి మాట్లాడాలని హితబోధ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనవసరమైన విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఎన్ని కోట్లు మంజూరు చేసి.. ఎన్ని పనులు చేశారో..? ప్రజలకు చెప్పాలని కోరారు.