Trending Now

ఎన్నికల కోసమే అయోధ్య రామమందిరం ప్రారంభం..

ప్రతిపక్షం, తెలంగాణ: ఎన్నికల కోసమే బీజేపీ అయోధ్య రామమందిరం ప్రారంభంచిందని మీడియా సమావేశంలో బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తోందన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళును మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తోందని.. బీజేపీపై ఆయన మండిపడ్డారు. దేవుడి గురించి మాట్లాడే బీజేపీ నేతలు..పెట్రోల్.. డీజిల్.. నిత్యవసర ధరల గురించి మాట్లాడరు. ధరల పెరుగుదలపై మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డి కి లేదన్నారు. ప్రజలను మోసం చేసే మాటలు బీజేపీ చెప్తుంది. దీన్ని ప్రజలు గమనించాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని.. 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని కోరారు. అలాగే మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి.. హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలిపించండి.. మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో.. డీజిల్ ధరలు తగ్గుతాయని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత బీజేపీ ఎప్పుడో విస్మరించిందని.. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ప్రచారం చేసుకుంటుంది.. 9 ఏండ్లలో మేము ఇది చేశాం అని ప్రజలకు చెప్పే పని చేసిందా..? అని ప్రశ్నించారు. బీజేపీ 420.. పార్టీ అని బీజేపీ నేతలు ప్రజలను ఛీటింగ్ చేస్తున్నారు.. బీజేపీ మీద చిటింగ్ కేసు పెట్టాలని ఆయన ఫైరయ్యారు. పేదల కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం చేసిందా..? కేవలం దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుందని బీజేపీపై జగ్గారెడ్డి మండిపడ్డారు.

Spread the love

Related News

Latest News