సచివాలయం ముందు పెట్రోల్‌తో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం..

ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణ సచివాలయం ముందు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పొలాల వివాదానికి సంబంధించి న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ సిద్ధిపేటకు చెందిన భార్యాభర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకుని ప్రమాదాన్ని నివారించారు.

తరువాత ఇద్దరిపై నీళ్లు పోసి సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News