ప్రతిపక్షం, జూలై 10: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ప్రసన్న మృతి చెందడం, రూ.1,400 కోట్ల పెట్టుబడి మోసం కేసుతో ఆమెకు ఉన్న సంబంధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. ‘షేర్‌బజార్ కిసాన్ పరివార్’ పేరుతో భూపాల్ నాయక్ తదితరులు పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలో డైరెక్టర్‌గా ప్రసన్న పలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు భూపాల్ నాయక్‌ను గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రసన్న మృతి దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ఆమె మరణానికి కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందనే విషయంపై ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెల్లడించలేదు.

















