‘కేసీఆర్ అవసరం లేదు.. నేనే చాలు’.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

ప్రతిపక్షం, జూలై 08: కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి అంశంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించొద్దని నిపుణులు ఎక్కడా చెప్పలేదని, అక్కడి నుంచి నేరుగా మిడ్ మానేరు వరకు నీటిని తరలించడం సాధ్యం కాదని మాత్రమే సూచించారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాగునీటి నిర్వహణ చేతకాకపోతే మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు తనకు అప్పగించాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. రైతులకు నీటిని ఎలా అందించాలో తాను చేసి చూపిస్తానని పేర్కొన్నారు.

అలాగే, తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ప్రభుత్వం చెబుతున్నట్లయితే, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించిన హరీశ్‌రావు, ఈ అంశంపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love

Related News

Latest News